Select Location
All Locations
State
Region
City / District
TOXIC: ‘A’ సర్టిఫికెట్ సినిమాలో హింస ఎక్కువైందంటూ రివ్యూలేంటి? ‘టాక్సిక్’ నెగిటివ్ టాక్పై ఫ్యాన్స్ ఫైర్

TOXIC: ‘A’ సర్టిఫికెట్ సినిమాలో హింస ఎక్కువైందంటూ రివ్యూలేంటి? ‘టాక్సిక్’ నెగిటివ్ టాక్పై ఫ్యాన్స్ ఫైర్

‘KGF’ తర్వాత యశ్ నుంచి వచ్చిన ‘టాక్సిక్’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన కొందరు యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్, విజువల్స్ అదిరిపోయాయని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం కథ, నేరేషన్, ఎడిటింగ్‌తో పాటు సినిమాలోని హింసను టార్గెట్ చేస్తూ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘టాక్సిక్’పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారికి యశ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

‘టాక్సిక్’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇప్పటికే ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేకాదు.. CBFC రికార్డులో కూడా ఈ సినిమాను గ్యాంగ్‌స్టర్ కథగా పేర్కొంటూ, బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సులు, వయెలెన్స్, చీకటి ప్రపంచం, నైతిక సంఘర్షణలు వంటి అంశాలతో కూడిన కథగా వివరించింది. అంటే ఇది పిల్లల కోసం రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాదన్న విషయం సర్టిఫికేషన్ స్థాయిలోనే స్పష్టమైంది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. CBFC నుంచి ఈ సినిమాకు A సర్టిఫికెట్ వచ్చినప్పటికీ పెద్దగా సీన్లు కట్ చేయలేదు. కొన్ని పదాల్లో మార్పులు, అవసరమైన హెచ్చరికలు మాత్రమే సూచించినట్లు రిపోర్టులు వెల్లడించాయి. అంటే ‘టాక్సిక్’లో హింస, అడల్ట్ థీమ్స్ ఉండబోతున్నాయనే విషయం రిలీజ్‌కు ముందే ప్రేక్షకులకు చెప్పేశారు. మరి సినిమా చూసిన తర్వాత “హింస ఎక్కువగా ఉంది.. అందుకే సినిమా బాలేదు” అనడం ఎంతవరకు కరెక్ట్? అనేది ఇప్పుడు ఫ్యాన్స్ వేస్తున్న సూటి ప్రశ్న.


V6 News 1 hour ago
Home Flash News