ఆసియా అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు మూడు స్వర్ణాలు
డా నాంగ్ (వియత్నాం): ఆసియా అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా రెజ్లర్లు మూడు స్వర్ణాలతో మెరిశారు. ఆదివారం జరిగిన విమెన్స్ 68 కేజీల ఫైనల్లో మానసి లూథర్ 14–1తో ఫిరూజా ఎసెన్‌బేవా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.
76 కేజీల టైటిల్ బౌట్‌లో కాజల్ 10–0తో ఐజార్కిన్ జానీబెకోవా (కిర్గిస్తాన్)ను చిత్తు చేయగా, గ్రీకో రోమన్ 63 కేజీల ఫైనల్లో సుమిత్ 12–2తో ఓజోద్‌బెక్ ఖలీల్‌బోయేవ్ (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గి స్వర్ణాలు సాధించారు. విమెన్స్ 57 కేజీ ఫైనల్లో స్వీటీ 5–7తో ఎంగోక్ ఎల్ (వియత్నాం) చేతిలో, 59 కేజీల్లో నేహా 5–9తో లాయ్లోఖోన్ సోబిరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. బ్రాంజ్ మెడల్ పోరులో అహిల్య ఎస్. షిండే 13–2తో అర్రేకే కాదిర్బెక్ క్విజి (కిర్గిస్తాన్)పై, 55 కేజీల్లో నీరజ్ పటేల్ 8–0తో రౌవాన్ బెకిమోవ్ (కజకిస్తాన్)పై, 87 కేజీల్లో రోహిత్ బురా 9–0తో ఆర్టిక్‌బెక్ అలీంబెక్ ఉల్ (కిర్గిస్తాన్)పై గెలిచారు.