Select Location
All Locations
State
Region
City / District
మా నాన్న‌ కేసీఆర్‌తో నాకు ఎలాంటి సమస్య లేదు..!

మా నాన్న‌ కేసీఆర్‌తో నాకు ఎలాంటి సమస్య లేదు..!

నేను రాజకీయ నేత, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయిన కేసీఆర్‌ను విమర్శించానని.. మా నాన్న‌ కేసీఆర్‌తో నాకు ఎలాంటి సమస్య లేదని.. కానీ రాజకీయ నేత కేసీఆర్‌తో మాత్రం నాకు సిద్ధాంతపరమైన విబేధాలు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయపరంగా ఆయన తప్పు చేస్తే కచ్చితంగా విమర్శిస్తా.. నేను తప్పు చేసినా సరే బీఆర్ఎస్ విమర్శించవచ్చన్నారు. తెలంగాణ వచ్చాక చాలా పనులు చేయాల్సి ఉండే.. లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అని ఉంటుంది. అవకాశం పోతే మళ్లీ రాదు.. లక్షా 21 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చార‌ని విమ‌ర్శించారు. నిరుద్యోగులకు మనం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే పదిసార్లు పేపర్ ఎందుకు లీకైంది..? గొప్ప ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉండగా పేపర్ లీక్ కావాల్సిన అవసరమేమొచ్చింది.? 

ఈ కారణంగా తెలంగాణలో రెండు జనరేషన్లు నష్టపోయారు.. వాళ్లంతా ప్రభుత్వ ఉద్యోగం రాక వాళ్ల జీవితాలనే కోల్పోయిన పరిస్థితి ఉందన్నారు. లాస్ట్ ఆపర్చునిటీస్ కాస్ట్ కారణంగా జరిగిన నష్టం బీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్తుంది.. అందుకే నేను కేసీఆర్‌ని విమర్శించాను.. తప్పు చేస్తే మళ్లీ విమర్శిస్తానన్నారు. పార్టీ పేరు కోసం మేము ప్రయత్నం చేస్తుండగా ఎన్నో కుట్రలు జరిగాయన్నారు. వాటన్నింటిని ఎదుర్కొనేందుకే మేము చాలా టాక్టిక్స్ వాడామాన్నారు. పేరు విషయంలో కావాలనే వ్యుహంగానే చాలా పేర్లు చెబుతూ వచ్చామ‌న్నారు. ఐతే తెలంగాణ రక్షణ సేన అనే పేరును నేను మూడో ప్రాధాన్యతగా పెట్టాను.. కానీ టీఆర్ఎస్ నాకు రాసి ఉందేమో.. ఎలక్షన్ కమిషన్ కూడా సరిగ్గా అదే పేరు ఇచ్చింది.. ఇది దైవ నిర్ణయమనే నేను భావిస్తున్నాన‌న్నారు.


Smacy News 1 day ago
Home Flash News