... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Rajendra Prasad: కావాలని అనలేదు.. క్షమించండి, ఇంకోసారి..

Rajendra Prasad: కావాలని అనలేదు.. క్షమించండి, ఇంకోసారి..

తెలుగు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.

ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. తమిళ సినీ ప్రేక్షకులు ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తారు. నేను కూడా ఆయన్ను దేవుడిలాగే భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో కొద్దిగా నోరు జారాను. అది కావాలని అనలేదు. కొందరు దీన్ని పెద్దది చేశారు. ఆయనపై కామెంట్స్‌ చేసేంత ధైర్యం నాకెక్కడిది? నేను చెన్నై ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడతానా? ఏదేమైనా నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలాంటి కామెంట్స్‌ చేయను అని క్షమాపణలు తెలిపాడు.

కాగా ఇటీవల ఓ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్‌ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్‌పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్‌ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్‌ సెలబ్రిటీలు విశాల్‌, నాజర్‌ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్‌ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు.

Source : Smacy News

1 hour ago

Home Flash News