Select Location
All Locations
State
Region
City / District
శ్రేయస్ అయ్యర్ కాదు.. టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!

శ్రేయస్ అయ్యర్ కాదు.. టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌ ముగిసిన తర్వాత టీమ్ఇండియాలో కీలక మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండేళ్లుగా జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త సారథిగా శ్రేయస్ అయ్యర్ పేరు వినిపించగా.. తాజాగా సంజుశాంసన్‌ కూడా రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత టీమ్ఇండియా మ్యాచ్‌లు ఆడలేదు. జూన్‌ నెలాఖరులో ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌తో కొత్త సీజన్‌ను ఆరంభించబోతోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. అప్పుడు కొత్త సారథిగా సంజు శాంసన్‌ను ప్రకటిస్తారని సమాచారం. వరుస విజయాలతో జోష్‌లో కేకేఆర్.. 

ఇదే సీన్ రిపీటైతే ప్లే ఆఫ్స్‌లోకి టీ20 ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం, ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అదరగొడుతుండటం, రాజస్థాన్‌కు సారథ్యం వహించిన అనుభవం ఉండటంతో శాంసన్‌ వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో శాంసన్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 402 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. ఐపీఎల్‌లో సారథిగా, ఆటగాడిగా రాణిస్తున్నప్పటికీ చాలాకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉండటం శ్రేయస్‌కు ప్రతికూలంగా మారినట్లు సమాచారం. అతను భారత్ తరఫున చివరి టీ20 మ్యాచ్‌ డిసెంబర్, 2023లో ఆడాడు. ఇప్పుడు జట్టులోకి తీసుకుని నేరుగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం రిస్క్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ టూర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆటగాడిగా జట్టులోకి కొనసాగించే వీలుందట. ఆ సిరీస్‌ల్లోనూ సూర్య విఫలమైతే అతడిని టీమ్‌ను నుంచి తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నారట.


Eenadu Telugu 1 hour ago
Home Flash News