Select Location
All Locations
State
Region
City / District
షాక్‌లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి!

షాక్‌లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి!

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారి సీజన్‌లో ఆర్సీబీ సక్సెస్ వెనుక చాలా మంది ఆటగాళ్ల కృషి దాగుంది. బ్యాటింగ్ విభాగంలో కోహ్లితో పాటు కెప్టెన్ పటీదార్‌, దేవదత్ పడిక్కల్‌, టిమ్ డేవిడ్‌లు అదరగొడుతుంటే, బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు.

ఇక 19 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడుతున్న కింగ్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో కోహ్లి 165.50 స్ట్రైక్‌రేట్‌తో 379 పరుగులు సాధించాడు. గతేడాది తొలిసారి చాంపియన్స్‌గా నిలిచిన ఆర్సీబీ వరుసగా ఈ సీజన్‌లోనూ కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఒక వార్త మాత్రం ఆర్సీబీని తెగ బాధపెట్టేస్తోంది. అదేంటంటే 18 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫిజియోగా సేవలందించిన ఎవన్ స్పీచ్‌లీకి ఆర్సీబీ ఘనంగా ఫేర్‌వెల్ ఇచ్చింది. ఆర్సీబీ జట్టు వెనుక ఎవన్ స్పీచ్‌లీ పాత్ర మరువలేనిది. 2008 నుంచి 2025 సీజన్ వరకు ఎవన్ స్పీచ్‌లీ ఆర్సీబీకి ఫిజియోగా పనిచేశాడు. ఈ 18 ఏళ్లలో ఎంతో మంది ఆర్సీబీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో పాటు వాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు ఎవన్ ఎంతో కృషి చేశారు. 

అయితే గత సీజన్ ముగిసిన అనంతరం ఎవన్ స్పీచ్‌లీ ఆర్సీబీ ఫిజియోగా రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎవన్ స్పీచ్‌లీకి ‘ఒక అధ్యాయం ముగిసింది’ (ఎండ్ ఆఫ్ ఎరా) పేరుతో ఫేర్‌వెల్ ఘనంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఆర్సీబీ తమ ‘ఎక్స్‌’ వేదికగా షేర్ చేసుకుంది. ఫిజియోగా రిటైర్ అయిన తర్వాత స్వదేశంలో ఉండిపోయిన ఎవన్ స్పీచ్‌లీ ఈ ఫేర్‌వెల్ వేడుక కోసం బెంగళూరుకు రావడం విశేషం. కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ఎవన్‌కు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించారు. ‘ ఎండ్ ఆఫ్ ఎరా, ఎవన్ స్పీచ్‌లీ’. నీ లెగసీని ఆర్సీబీ ఎప్పటికీ గుర్తుం చుకుంటుంది. 18 ఏళ్లుగా ఎవన్ స్పీచ్‌లీ ఆర్సీబీకి హెడ్ ఫిజియోగా వ్యవహరించారు. అందుకే అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నాం.’ అని క్యాప్షన్ జత చేసింది.


Sakshi 1 day ago
Home Flash News