... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. 254 మంది మృతి

లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. 254 మంది మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా- ఇరాన్‌ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌(Israel) క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. సీజ్‌ఫైర్‌ ప్రకటన అనంతరం కూడా ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై దాడి చేయడంతో ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈక్రమంలోనే హర్మూజ్‌ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్‌ తాజాగా చేసిన దాడుల్లో ఇప్పటివరకు 254 మంది మరణించగా 1000 మందికి పైగా గాయాలపాలయ్యారని అధికారులు పేర్కొన్నారు.

 కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాతే లెబనాన్‌పై ఈ దాడులు జరిగాయి. సీజ్‌ఫైర్‌లో భాగంగా తమ మిత్రపక్షాలపై దాడులు చేయకూడదని ఇరాన్(Iran) డిమాండ్ చేయగా.. ఇజ్రాయెల్ అంగీకరించలేదు. అప్పటివరకు ఇరాన్‌ చుట్టూనే మా బలగాలు: ట్రంప్‌ కీలక పోస్ట్‌ హెజ్‌బొల్లా చేసే దాడులను అడ్డుకొనే లక్ష్యంతో లిటాని నది వరకు బఫర్‌జోన్‌ను ఏర్పాటుచేసుకోవడానికి మార్చి 2న ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లో గ్రౌండ్‌ ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పుడు ఈ ఆపరేషన్‌ను ఆపేందుకు ఇజ్రాయెల్ సుముఖంగా లేదు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం 10 నిమిషాల వ్యవధిలో లెబనాన్‌ (Lebanon)లోని పలు ప్రదేశాలపై 100 ఎయిర్‌ స్ట్రయిక్స్‌ చేపట్టిన సంగతి తెలిసిందే.

Source : Eenadu Telugu

2 hours ago

Home Flash News