... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
సింగపూర్ నుంచి వచ్చిన 70 డ్రోన్లు సీజ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత

సింగపూర్ నుంచి వచ్చిన 70 డ్రోన్లు సీజ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత

శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో భారీగా డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు.సింగపూర్​ నుంచి తీసుకొస్తున్న 70 డ్రోన్లను సీజ్​ చేశారు. డ్రోన్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో డ్రోన్లను సింగపూర్​ నుంచి తీసుకురావడం వెనక కారణం ఏంటనే కోణంలో విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

శనివారం (మార్చి 14) శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింగపూర్​ నుంచి ముగ్గురు ప్రయాణికులు తీసుకొచ్చిన 70 డ్రోన్లను కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు విమానాల్లో ఈ డ్రోన్లను సింగపూర్​ నుంచి శంషాబాద్​ కు తీసుకువచ్చారు. పట్టుకున్న డ్రోన్ల విలువ దాదాపు రూ.50లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరోవైపు పశ్చిమాసియా దేశాల్లో ఎయిర్ స్పేస్ క్లోజ్​ చేయడంతో శంషాబాద్​ ఎయిర్ పోర్టు నుంచి ఆయా దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. శనివారం మొత్తం 13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశారు.

Source : V6 News

1 hour ago

Home Flash News