... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడి బరిలో కొడుకు ట్రంప్ జూనియర్.. టాప్ ఇన్వెస్టర్ అంచనా

ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడి బరిలో కొడుకు ట్రంప్ జూనియర్.. టాప్ ఇన్వెస్టర్ అంచనా

అమెరికా రాజకీయాల్లో రాబోయే మార్పులపై సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ ఛైర్మన్ చార్లెస్ మైయర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 3వ సారి అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు. ట్రంప్ మరోసారి పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నప్పటికీ.. రాజ్యాంగపరమైన పరిమితులు, రాజకీయ సమీకరణాల వల్ల అది సాధ్యం కాకపోవచ్చని అన్నారు. అయితే ట్రంప్ వారసుడిగా ఆయన కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ వచ్చే ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందని మైయర్స్ అంచనా వేయడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

రిపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుతం జేడీ వాన్స్ రేసులో ముందున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ట్రంప్ మద్దతు ఆయనకు పూర్తిస్థాయిలో ఉంటుందా లేదా అనే సంశయం ఉందన్నారు. ఒకవేళ ట్రంప్ తన కుమారుడిని ప్రోత్సహిస్తే సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. రిపబ్లికన్ ప్రైమరీలలో మార్కో రూబియో, నిక్కీ హేలీ, టెడ్ క్రజ్ వంటి బలమైన నేతలు కూడా పోటీ పడే అవకాశం ఉందని, దీనివల్ల పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంటుందని మైయర్స్ అభిప్రాయపడ్డారు. అటు డెమొక్రాట్ల వైపు నుంచి కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ ఒక బలమైన అభ్యర్థిగా ఎదిగే అవకాశం ఉందని, 2028లో డెమొక్రాట్లు మళ్లీ వైట్ హౌస్‌ను కైవసం చేసుకుంటారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల ఫలితాలపై కూడా మైయర్స్ కీలక అంచనాలు వేశారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు ప్రతినిధుల సభను గెలుచుకునే అవకాశం ఉందని, సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్లు తమ పట్టును నిలబెట్టుకోవచ్చని చెప్పారు. అయితే ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగితే.. అది అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని పెంచి ప్రజలపై భారం మోపుతుందని, ఆ పరిస్థితుల్లో ఓటర్లు డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల సెనేట్‌లో కూడా డెమొక్రాట్లు ఆధిపత్యం సాధించే అవకాశం లేకపోలేదని తన విశ్లేషణను బయటపెట్టారు.

అమెరికా రాజకీయ సంస్థలు చాలా పటిష్టంగా ఉన్నాయని, ప్రజాస్వామ్య ప్రక్రియపై తనకు పూర్తి నమ్మకం ఉందని మైయర్స్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అమెరికా కాంగ్రెస్ విడిపోయే అవకాశం ఎక్కువగా ఉందని.. దీనివల్ల ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన విధాన నిర్ణయాలలో ప్రతిష్టంభన ఏర్పడవచ్చు లేదా పెద్ద మార్పులకు అవకాశం పరిమితం కావచ్చని హెచ్చరించారు. మొత్తానికి డోనాల్డ్ ట్రంప్ స్థానంలో ఆయన కుమారుడు రాజకీయ తెరపైకి రావడం, డెమొక్రాట్ల పునరాగమనం వంటి అంశాలు అమెరికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Source : V6 News

2 hours ago

Home Flash News