కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్‌కు హర్షిత్ రాణా దూరం
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (Kolkata Knight Riders) పెద్ద షాక్ తగిలింది. పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) జట్టుకు దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌నకు ముందు అతడు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మోకాలి గాయానికి గురైన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స తర్వాత అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అతడి స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ రిప్లేస్‌మెంట్‌గా తీసుకోలేదు.
‘దురదృష్టవశాత్తు హర్షిత్ రాణా అందుబాటులో ఉండకపోవచ్చు. జట్టులోని ఇతర బౌలర్లు వైభవ్, ఉమ్రాన్, కార్తిక్, ఆకాశ్‌కు ఆడే అవకాశం దక్కొచ్చు. అయితే హర్షిత్ స్థానంలో ఇంకా ఎవరినీ భర్తీ చేయలేదు’ అని కోల్‌కతా ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.