... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ‘బాలిక అబార్షన్’ కేసులో సాయి కృప ఆస్పత్రి సీజ్

కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ‘బాలిక అబార్షన్’ కేసులో సాయి కృప ఆస్పత్రి సీజ్

కొల్లాపూర్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ కొండా శ్రీనివాసులు, శ్రీదేవి కొండ శెట్టి దంపతులు నిర్వహిస్తున్న సాయికృప ప్రైవేట్ హాస్పిటల్ ను శుక్రవారం నాగర్ కర్నూల్ డీఎంహెచ్ఓ రవికుమార్ నాయక్ సీజ్ చేశారు. ఆస్పత్రిలో ఇల్లీగల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమ విచారణలో తేలండంతో సీజ్ చేశామని ఆయన తెలిపారు. కాగా, ఈ ఆస్పత్రిలో ఓ బాలికకు అబార్షన్ చేయడంతో హాస్పిటల్​యజమాని కొండా శ్రీనివాసులు శెట్టిని , వైద్యురాలిని, సిబ్బందిలో ఒకరిని ఇప్పటికే రిమాండ్​ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల ఓ ఇంటర్​ విద్యార్థి ముగ్గురి ఇంటర్​ విద్యార్థినులపై వేర్వేరుగా అత్యాచారం చేసి, అది వీడియో తీసి బ్లాక్ ​మెయిల్​ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ముగ్గురు విద్యార్థినిలో ఓ బాలికకు ఇదే ఆస్పత్రిలో అబార్షన్​ చేశారనే ఫిర్యాదు అందడంతో మెడికల్​, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించి ఆస్పత్రిని సీజ్​ చేశారు. స్థానిక ఎస్సై బండారి సురేశ్, ఏఎస్సై రామస్వామి గౌడ్ , డాక్టర్​జయ యాదవ్ ఉన్నారు.

Source : V6 News

1 hour ago

Home Flash News