Select Location
All Locations
State
Region
City / District
డ్రోగో ఏరోస్పేస్, ఎంఐఎల్ మధ్య ఒప్పందం

డ్రోగో ఏరోస్పేస్, ఎంఐఎల్ మధ్య ఒప్పందం

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డ్రోగో ఏరోస్పేస్ సంస్థ స్వదేశీ యూఏవీ, లోటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థల డెవలప్​మెంట్​, తయారీ కోసం రక్షణ రంగ ప్రభుత్వ సంస్థ మ్యూనిషన్స్ ఇండియాతో పూణెలో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో డ్రోగో ఏరోస్పేస్ సంస్థ యూఏవీ ప్లాట్‌‌ఫారమ్‌‌లు, పేలోడ్ హార్డ్‌‌వేర్ తయారీపై దృష్టి పెడుతుంది. ఎంఐఎల్ సంస్థ రక్షణ మ్యూనిషన్స్, వార్‌‌హెడ్ టెక్నాలజీల్లో తన నైపుణ్యాన్ని అందిస్తుంది. ఈ రెండు సంస్థలు కలిసి మ్యూనిషన్, యూఏవీ అనుసంధానం, భద్రతా మూల్యాంకనాలు, క్షేత్ర స్థాయి పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ సహకారంలో భాగంగా డ్రోగో ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన డెల్టా వింగ్ కామికాజే యూఏవీని ఇటీవల హైదరాబాద్‌‌లో విజయవంతంగా పరీక్షించారు. 


V6 News 1 hour ago
Home Flash News