Select Location
All Locations
State
Region
City / District
ఇరాన్‎కు రష్యా స్రీకెట్ హెల్ప్.. అమెరికా యుద్ధ నౌకలే టార్గెట్‎గా మిస్సైల్స్ తయారీ..!

ఇరాన్‎కు రష్యా స్రీకెట్ హెల్ప్.. అమెరికా యుద్ధ నౌకలే టార్గెట్‎గా మిస్సైల్స్ తయారీ..!

న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ యుద్ధం వేళ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. పశ్చిమాసియాలోని అమెరికా విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఆత్యాధునిక రామ్‎జెట్ ప్రొపల్షన్ టెక్నాలజీతో కూడిన కొత్త తరం సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేయడంలో ఇరాన్‌కు రష్యా రహస్యంగా సహాయం చేస్తోందని పేర్కొంది.

C430L అనే కోడ్ నేమ్‎తో 2023లోనే ఈ సీక్రెట్ ప్రోగ్రామ్ ప్రారంభమైందని సంచలన విషయం బయటపెట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా దశాబ్దాలుగా ఇరాన్ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్న రామ్‌జెట్ ప్రొపల్షన్ సాంకేతికతను రష్యా అందిస్తోంది. రష్యాకు చెందిన ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయుధ ఎగుమతి సంస్థ రోసోబోరోనెక్స్‌పోర్ట్, క్షిపణి తయారీ సంస్థ NPO మాషినోస్ట్రోయేనియా కలిసి ఈ ప్రాజెక్టును సమన్వయం చేస్తున్నాయి.


V6 News 2 hours ago
Home Flash News