Select Location
All Locations
State
Region
City / District
NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్!

NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్!

NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటైన డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ విజువల్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటైన డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ విజువల్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా బరువు తగ్గి, స్లిమ్ ఫిజిక్‌తో కనిపించడం అభిమానులను మొదట ఆశ్చర్యానికి గురి చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫొటోలు చూసిన అభిమానులు తారక్ ఆరోగ్యం బాగానే ఉందా? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సినిమా పాత్ర కోసం అవసరమైన శారీరక మార్పు కోసమే ఎన్టీఆర్ ఈ మేకోవర్ చేసినట్లు తర్వాత స్పష్టమైంది. పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ ఓ ప్రత్యేకమైన లుక్‌లో కనిపించనున్నారట. ముఖ్యంగా సినిమాలోని ‘లూగర్’ గెటప్ కోసం ఆయన నెలల తరబడి కఠినమైన డైట్, ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ను అనుసరించినట్లు తెలుస్తోంది. పాత్రకు అవసరమైన బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ కోసం ఎన్టీఆర్ తనను తాను పూర్తిగా మార్చుకోవడం ఆయన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్‌కు నిదర్శనమని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

అయితే లేటెస్ట్ లుక్‌తో ఫ్యాన్స్ కాస్త‌ రిలీఫ్ అయ్యారు. అక్కినేని హీరో అఖిల్‌ని క‌లిసిన ఫొటోలు బ‌య‌ట‌కు రాగా, ఇందులో ఆయన స్లిమ్‌గా ఉన్నప్పటికీ ఎంతో ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించడం అభిమానులకు ఊరటనిచ్చింది. గతంలో వైరల్ అయిన ఫొటోలతో పోలిస్తే ఇప్పుడు తారక్ మరింత హెల్దీగా కనిపిస్తున్నాడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో మొదట వ్యక్తమైన ఆందోళన చాలావరకు తగ్గిపోయింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్టీఆర్‌ను ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు సమాచారం.


Smacy News 8 days ago
Home Flash News