యుద్ధం మళ్లీ భీకరంగా..
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ఉధృతం అయ్యాయి. శాంతి చర్చలకు ఇరాన్ జాప్యం చేస్తుంది.. మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లో ఇరాన్ పై అమెరికా రెండో దఫా వైమానిక దాడులకు దిగింది. ప్రతీకారంగా ఇరాన్ కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. పరస్పర దాడులతో అమెరికా, ఇరాన్ మద్య యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఈ దాడులతో ఇప్పటికే బలహీనంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత దెబ్బతీసి మిడిల్ ఈస్ట్ లో ఘర్షణలను మరింత పెంచాయి.
గురువారం ఇరాన్ పై అమెరికా సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడింది. నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్ వర్క్ లు, వాయు రక్షణ స్థావరాలతో సహా పలు ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తరచుగా దాడులు, హార్ముజ్ మార్గంలో అమెరికా బలగాలకు, నౌకయానం జరగకుండా ఇరాన్న అడ్డుపడుతోందని ప్రతిస్పందన గా ఈ దాడులు చేసినట్లుయూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్ ) తెలిపింది. ఇరాన్ లోని పలు నిర్దిష్ట సైనిక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేశామని సెంట్ కామ్ ప్రకటించింది.