Select Location
All Locations
State
Region
City / District
ఇంటర్న్‌షిప్‌ చేసిన చోటే ప్లేస్‌మెంట్‌.. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన వెల్లడి

ఇంటర్న్‌షిప్‌ చేసిన చోటే ప్లేస్‌మెంట్‌.. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన వెల్లడి

హైదరాబాద్‌, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యార్థులకు ఒక చేతిలో పట్టా.. మరో చేతిలో ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. స్కిల్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేసిన చోటే ప్లేస్‌మెంట్‌ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 80-90% విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ చేసిన చోటే ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

సోమవారం నాంపల్లిలోని రూసా భవనంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి, సీఐఐ ప్రతినిధి సీ శేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆచార్యులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావు, ప్రొఫెసర్‌ ఈ వెంకటేశ్‌తో కలిసి మీడియాతో పాలిటెక్నిక్‌, డిగ్రీ కోర్సుల్లో సమూల మార్పులు చేశామని తెలిపారు. మూస పద్ధతులకు గుడ్‌బై చెప్పి.. పరిశ్రమ అవసరాలకు తగిన సిలబస్‌ను తయారుచేశామని, కొత్తగా డిగ్రీలో 11 అప్రెంటిస్‌షిప్‌ కోర్సులు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడు వేల కోట్లతో ల్యాబ్‌లను నెలకొల్పనున్నామని శ్రీదేవసేన వెల్లడించారు. డిప్లొమాలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను దేశంలో ఎక్కడా వినియోగించడంలేదని, తొలిసారిగా ఏఐని ప్రవేశపెట్టామని తెలిపారు.


Smacy News 1 hour ago
Home Flash News