Select Location
All Locations
State
Region
City / District
SRHvsRCB మ్యాచ్ టికెట్ల దందా వెలుగులోకి.. 3 నిమిషాల్లోనే 39 వేల టికెట్లు అమ్ముడుపోవడం వెనుక..

SRHvsRCB మ్యాచ్ టికెట్ల దందా వెలుగులోకి.. 3 నిమిషాల్లోనే 39 వేల టికెట్లు అమ్ముడుపోవడం వెనుక..

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా నడుస్తుండగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కాంప్లిమెంటరీ టికెట్లు ఇలా పక్కదారి పడుతున్నాయి. బహిరంగంగా బ్లాక్‌లో ఉప్పల్ లో మ్యాచ్ జరిగే రోజే ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ టికెట్లను అమ్ముతున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. మరికొన్ని గంటల్లో ఉప్పల్లో మ్యాచ్ జరగనున్న సమయంలో థియేటర్ల దగ్గర సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మినట్లు ఇలా క్రికెట్ మ్యాచ్ టికెట్లు అమ్ముతుండటంపై నిజాయతీగా టికెట్లు కొనుక్కున్న అభిమానులు మండిపడుతున్నారు. డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లను కొని ఈ బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. డిస్ట్రిక్ట్ యాప్లో 39 వేల టికెట్లు 3 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. 3 నిమిషాల్లోనే సోల్డ్‌ ఔట్‌ అంటూ డిస్ట్రిక్‌ యాప్‌లో బోర్డ్‌ కనిపించడంపై అభిమానులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముఠాగా ఏర్పడి డిస్ట్రిక్‌ యాప్‌లో ఈ బ్లాక్ టికెట్ల గ్యాంగ్ పెద్ద సంఖ్యలో టికెట్లు కొంటున్నట్లు తెలిసింది. ఇదే అదునుగా సైబర్‌ నేరగాళ్లు కూడా ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు నకిలీ యాప్‌ క్రియేట్‌ చేసి ఫేక్‌ టికెట్లను అమ్మడం మొదలుపెట్టారు.


V6 News 18 days ago
Home Flash News