Select Location
All Locations
State
Region
City / District
ఐఎఫ్ఎస్‌కు హెడ్ కానిస్టేబుల్ కూతురు ఎంపిక‌.. ఎస్పీ న‌ర‌సింహ స‌న్మానం

ఐఎఫ్ఎస్‌కు హెడ్ కానిస్టేబుల్ కూతురు ఎంపిక‌.. ఎస్పీ న‌ర‌సింహ స‌న్మానం

సూర్యాపేట టౌన్, మే 09 : సూర్యాపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చల్లా యాదగిరి కూతురు యామిని సివిల్స్‌లో ప్ర‌తిభ చూపి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు ఎంపికైంది. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నర‌సింహ హెడ్ కానిస్టేబుల్ యాదగిరిని, కూతురు యామిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యామినిని సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమైన విధానాన్ని, శిక్షణ విధానాన్ని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో మంచి స్థాయికి చేరుకోవాలని, మరిన్ని ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆయ‌న‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్ట‌ర్ రామారావు, పోలీస్ సంక్షేమ ఆర్ఎస్ఐ సాయిరాం, నర్సింగరావు పాల్గొన్నారు.


Smacy News 1 hour ago
Home Flash News