Select Location
All Locations
State
Region
City / District
తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారే..డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో వేగంగా అభివృద్ది

తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారే..డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో వేగంగా అభివృద్ది

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వెలువడుతున్న ఎన్నికల ఫలితాల ఊపు తెలంగాణలోనూ కొనసాగుతుందని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మహారాష్ట్ర, ఢిల్లీ బాటలోనే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రజలు కూడా బీజేపీకి పట్టం కట్టారన్నారు. ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. మోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీకి కొత్త ఊపు వస్తుందన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీయే ప్రత్యామ్నాయమని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజల తీర్పుతో బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరుతుందని, అక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధిలో వేగం పెరుగుతుందని చెప్పారు.


V6 News 1 hour ago
Home Flash News