అంత పెంచేస్తే ఎలా..?
వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెంచేయడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెంచేయడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేవలం మూడు నెలల్లోనే వాణిజ్య సిలిండర్ ధరను 81 శాతం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య సిలిండర్ ధరను ఒక్కరోజులోనే రూ.993 పెంచారని, ఇది కచ్చితంగా ఎన్నికల బిల్లు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని తాను ముందే హెచ్చరించానన్నారు. అందుకు నిదర్శనమే నేడు వాణిజ్య సిలిండర్ ధర పెంపు అని తెలిపారు.
రూ.993 పెరగడమంటే, ఇది ఒకరోజులో నమోదైన అతిపెద్ద పెరుగుదల అని ఆయన అన్నారు. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ధర రూ.1,380 పెరిగిందని ఆరోపించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల ఈ ప్రభావం చిన్న చిన్న వ్యాపారులపై తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీ దుకాణాలు, చాయ్-టిఫిన్ డబ్బాలు, హోటళ్లు, బేకరీలు, మిఠాయి దుకాణాలు తదితర వాటిపై ప్రభావం పడుతుందని అన్నారు.