Select Location
All Locations
State
Region
City / District
T20 World Cup 2026: నేడే భారత జట్టు ప్రకటన

T20 World Cup 2026: నేడే భారత జట్టు ప్రకటన

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గొనే భారత జట్టు బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం(మే 2) ప్రకటించనుంది. ప్రపంచకప్ జట్టునే కాకుండా, అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో జరిగే మూడు టీ20లకు కూడా భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్లపై సెలక్టర్లు వేటు వేసే అవకాశముంది.

అదేవిధంగా ప్రోటీస్ సిరీస్‌లో ఆక‌ట్టుకున్న శ్రీ చరణి, భారతి ఫుల్మాలి వంటి వారికి యంగ్ ప్లేయ‌ర్ల‌కు చోటు ద‌క్కుతుందో లేదో చూడాలి. గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ గెల‌వ‌డంలో శ్రీ చ‌ర‌ణిది కీల‌క పాత్ర‌. కాబ‌ట్టి ఈ తెలుగు అమ్మాయిని టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టుకు కూడా ఎంపిక చేయాల‌ని చాలా మంది సూచిస్తున్నారు. బౌల‌ర్ల విభాగంలో అరుంధ‌తి రెడ్డి, క్రాంత్ గౌడ్‌, రేణుకా సింగ్ ఠాకూర్‌ల‌కు చోటు ద‌క్కే ఛాన్స్ ఉంది. బ్యాటర్ల‌గా షెఫాలీ వ‌ర్మ‌, మంధాన‌, రోడ్రిగ్స్, కెప్టెన్ హార్మ‌న్‌ప్రీత్ కౌర్ వంటి ఎలాగూ ఉంటారు. 

అదేవిధంగా రిచా ఘోష్‌కు బ్యాక‌ప్ వికెట్ కీప‌ర్‌గా ఉమా ఛెత్రిని ఎంపిక చేసే అవ‌కాశ‌ముంది. ఇక ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జూన్‌ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్‌ వేదికగా జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది టి20 ప్రపంచకప్‌లలో ఆడిన భారత జట్టు నాలుగుసార్లు (2009, 2010, 2018, 2023లో)సెమీఫైనల్‌కు చేరుకొని, ఒకసారి (2020లో) రన్నరప్‌గా నిలిచింది. వరల్డ్‌కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే ఈ మెగా టోర్నీలో భారత్ గ్రూప్-1లో ఉంది. మనతో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఈ గ్రూపులో ఉన్నాయి.


Sakshi 1 hour ago
Home Flash News