రాయల్స్‌పై కోల్‘ఖాతా’ తెరిచేనా..? లఖ్‌నవూపై ‘పంజా’బ్ విసిరేనా?
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో సండే డబుల్ బొనాంజా డే. నిన్నటి మాదిరిగా నేడు కూడా రెండు మ్యాచులతో అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. ఇప్పటి వరకూ విజయాల ఖాతా తెరవని కోల్‌కతా రాజస్థాన్‌ను ఢీకొట్టనుంది. ఇక అగ్రస్థానంపై కన్నేసిన పంజాబ్ రెండో మ్యాచ్‌లో లఖ్‌నవూతో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో ఆయా జట్ల మధ్య ముఖాముఖి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడసలే ఓటమి ప్రతీకారంతో రగులుతోన్న రాజస్థాన్ రాయల్స్‌ను ఇంకా విజయాల ఖాతా తెరవని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. గత మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ నుంచి ఈసారి భారీ ఇన్నింగ్స్ వస్తుందని ఆర్‌ఆర్ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇరు జట్ల మధ్య 30 మ్యాచులు జరగగా.. కేకేఆర్ 16-14 ఆధిక్యంలో ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లోనూ కోల్‌కతాదే లీడ్. ఇక్కడ 11 మ్యాచుల్లో 7-4తో ముందంజలో ఉంది.