Select Location
All Locations
State
Region
City / District
LIVE
ఎట్టకేలకు ‘పవర్‌ పేట’పై అధికారిక ప్రకటన.. ఆసక్తి రేకెత్తించేలా పోస్టర్‌

ఎట్టకేలకు ‘పవర్‌ పేట’పై అధికారిక ప్రకటన.. ఆసక్తి రేకెత్తించేలా పోస్టర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పవర్‌ పేట’ (Power Peta) సినిమాపై గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సందీప్‌ యాక్టింగ్‌ కెరీర్‌కు 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కొత్త సినిమా పోస్టర్‌ను టీమ్‌ విడుదల చేసింది. చెస్‌ బోర్డుపై రక్తపు మరకలు, ఎర్ర గులాబీతో డిజైన్‌ చేసిన పోస్టర్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ప్రేమ, గౌరవం, రాజకీయం ప్రధానాంశాలుగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు అర్థమవుతోంది. కృష్ణచైతన్య దర్శకత్వం వహించే ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్‌ డైరెక్టర్‌. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. 

హీరోయిన్‌, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఓ ప్రియా ప్రియా, చిన్నదాన నీకోసం (ఇష్క్‌), గుండెజారి గల్లంతయ్యిందే తదితర హిట్‌ పాటలను రాసిన కృష్ణ చైతన్య ‘రౌడీ ఫెలో’తో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తర్వాత ‘ఛల్‌ మోహన్‌ రంగ’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ తెరకెక్కించారు. ఎప్పటినుంచో ‘పవర్‌ పేట’పై చర్చ నడుస్తోంది. చైతన్య ముందుగా ఈ సినిమాని నితిన్‌తో తెరకెక్కిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో విశ్వక్‌సేన్‌ పేరు తెర పైకి వచ్చింది. దానిపైనా స్పష్టత రాకపోవడంతో.. సందీప్‌ కిషన్‌తో చేయనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది.

ఎట్టకేలకు ఇప్పుడు అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అయ్యప్ప దీక్ష నాలో ఆ మార్పు తెచ్చింది: ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్‌ చరణ్‌ సందీప్‌ విషయానికొస్తే.. ‘ప్రస్థానం’తో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. దేవ కట్టా తెరకెక్కించిన ఈ మూవీలో ఆయన నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఓ కీలక పాత్రలో నటించారు. 2010 ఏప్రిల్‌ 16న ఈ సినిమా విడుదలైంది. హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘రా రా కృష్ణయ్య’, ‘నగరం’, ‘మజాకా’ తదితర చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం ‘సిగ్మా’లో నటిస్తున్నారు. కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.


Eenadu Telugu 1 hour ago
Home Flash News