Select Location
All Locations
State
Region
City / District
LIVE
Gaurav Gogoi: రిజ‌ర్వేష‌న్ పేరుతో డీలిమిటేష‌న్ బుల్డోజ్ చేస్తున్నారు: గౌర‌వ్‌ గ‌గోయ్‌

Gaurav Gogoi: రిజ‌ర్వేష‌న్ పేరుతో డీలిమిటేష‌న్ బుల్డోజ్ చేస్తున్నారు: గౌర‌వ్‌ గ‌గోయ్‌

న్యూఢిల్లీ: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని చూస్తున్న‌ట్లు కాంగ్రెస్ ఆరోపించింది. డీలిమిటేష‌న్ బిల్లుపై ఇవాళ లోక్‌స‌భ‌లో ఆ పార్టీ ఎంపీ గౌర‌వ్‌ గ‌గోయ్ మాట్లాడారు. ఒక‌వేళ మ‌హిళా కోటా చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌నుకుంటే, తాజా లోక్‌స‌భ సీట్ల సంఖ్య ఆధారంగా త‌క్ష‌ణ‌మే రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌న్నారు. మ‌హిళ‌ల‌కు ఆ బిల్లులు వ్య‌తిరేకింగా ఉన్నాయ‌న్నారు. కుల‌గ‌ణ‌న‌కు, రాజ్యాంగానికి, ఫెడ‌ర‌ల్ స్పూర్తికి వ్య‌తిరేకంగా ఆ బిల్లులు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 

మ‌హిళా రిజర్వేష‌న్ పేరుతో డీలిమిటేష‌న్‌ను కేంద్రం బుల్డోజ్ చేస్తున్న‌ద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌కు తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, కానీ దాన్ని స‌ర‌ళీక‌రించాల‌ని, డీలిమిటేష‌న్‌తో లింకు చేయ‌వ‌ద్దు అని, 543 సీట్ల ఆధారంగానే లోక్‌స‌భ‌లో రిజ‌ర్వేష‌న్ చేప‌ట్టాల‌ని గ‌గోయ్ కోరారు. జాప్యం చేసేందుకే రెండు బిల్లుల‌ను క‌లిపిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఒక‌వేళ తాము చెప్పిన‌ట్లు 2023లోనే విని ఉంటే, అప్పుడు 2024లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అమ‌లు అయ్యేద‌న్నారు.


Smacy News 1 hour ago
Home Flash News