బెంగాల్లో 91 లక్షల ఓట్ల తొలగింపు ఓటు హక్కు ప్రమాదంలో పడుతోందా ?
ఎన్యూమరేషన్ ఫారం సరైన సమయంలో అందక సరియైన ధ్రువపత్రాలు సమర్పించడానికి సమయం సరిపోకపోవడం, 2003 ఓటరు లిస్టులో పూర్వీకుల పేరు మ్యాచ్ కాకపోవడం తదితర కారణాలతో వీరంతా ఓట్లను కోల్పోయారు. వీరందరూ బూత్ లెవెల్లో ఎన్నికల అధికారి ముందు హియరింగ్కి హాజరై ఎన్యూమరేషన్ ఫారంతోపాటు సరియైన ధ్రువపత్రాలు సమర్పించారు. 6 ఏప్రిల్ 2026న ఎన్నికల కమిషన్ తుది జాబితాను ప్రకటించింది.
ఎస్ఐఆర్ జరిగిన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, పశ్చిమబెంగాల్లో తొలి జాబితా కంటే తుది జాబితా ప్రకటన వచ్చేవరకు మరింత భారీగా ఓట్లు తొలగిపోయాయి. ఇది బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా గెలవాలని ఎన్నికల సంఘం బీజేపీ ఏజెంటుగా మారి పనిచేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఓట్లు కోల్పోయిన 27 లక్షలలో మెజార్టీ ఓటర్లు ముస్లింలు ఉన్నారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. పశ్చిమబెంగాల్ మొత్తం జనాభాలో ముస్లింలు 30 శాతం. వీరంతా తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు. వీరి ఓట్లు బీజేపీకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి వీరి ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.