Select Location
All Locations
State
Region
City / District
ఇలాంటి పోప్‌ నాకొద్దు: ట్రంప్‌

ఇలాంటి పోప్‌ నాకొద్దు: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికాలో జన్మించిన తొలి పోప్‌ లియో-14, అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియా యుద్ధంపై పోప్‌ చేసిన వ్యాఖ్యలు, వాటిపై ట్రంప్‌ ఘాటు స్పందనతో వాతావరణం వేడెక్కింది. నేను వైట్‌హౌస్‌లో లేకుంటే లియో అసలు పోప్‌ అయ్యేవారే కాదని, ఆయన వామపక్ష తీవ్రవాదులకు మద్దతు పలుకుతున్నారని ట్రంప్‌ పేర్కొనగా, ట్రంప్‌ ప్రభుత్వానికి తాను భయపడటం లేదని, క్రైస్తవ సువార్త ఆధారంగానే తాను శాంతికి పిలుపునిచ్చానని పోప్‌ స్పష్టం చేశారు. అసలింతకీ ఏం జరిగిందంటే.. 

 ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని పోప్‌ ఖండిస్తూ.. ‘సర్వశక్తిమంతులమనే భ్రమ, అధికార మోహం యుద్ధాలకు దారితీస్తోంద’ంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే పోప్‌ తన వ్యాఖ్యల్లో నేరుగా ట్రంప్‌ పేరును ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు ట్రంప్‌నకు రుచించలేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ఆదివారం రాత్రి పోప్‌ లియో-14పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సామాజిక మాధ్యమంలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.


Eenadu Telugu 15 hours ago
Home Flash News