Select Location
All Locations
State
Region
City / District
అక్క చెక్కిన ‘పేస్‌ గుర్రం’.. ప్రఫుల్‌ హింగే

అక్క చెక్కిన ‘పేస్‌ గుర్రం’.. ప్రఫుల్‌ హింగే

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తొలిసారి సీనియర్‌ బౌలర్లు లేకుండా.. కొత్త కుర్రాళ్లతో బరిలోకి దిగింది. మరోవైపు రాజస్థాన్‌ రాయల్స్‌ ఊపుమీదున్న జట్టు. వరుసగా నాలుగు విజయాలు సాధించిన ఆ టీమ్‌కు షాక్‌ ఇస్తూ సన్‌రైజర్స్ అద్భుత విజయం సాధించింది. ప్రఫుల్ హింగే మొదటి ఓవర్‌లోనే పింక్‌ టీమ్‌ ఓటమిని ఖరారు చేసేశాడు. సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్‌ను డకౌట్ చేసి రాజస్థాన్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 34 పరుగులే ఇచ్చిన అతడు 4 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రంలోనే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకొన్న అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నిలిచాడు. మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు.
సంచలన ప్రదర్శనతో ఐపీఎల్‌లో స్టార్‌గా మారిన ప్రఫుల్ క్రికెట్ జర్నీ సాఫీగా సాగలేదు. 13 ఏళ్ల వయసులో రోజూ సైకిల్‌పై నాగ్‌పూర్‌కు కాస్త దూరంగా ఉండే అకాడమీలో ప్రాక్టీస్ చేయడానికి వెళ్లేవాడు. మొదట్లో బ్యాటర్‌గా ఉన్న ప్రఫుల్ ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. తన తండ్రి ఇచ్చిన సూచనతో బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మొదట్లో చాలా ఇబ్బందిపడ్డాడు. బౌలింగ్‌ తీరు కూడా కాస్త అనుమానాస్పదంగా ఉండేది. దీంతో బౌలర్‌గా మారాలనే నిర్ణయం తప్పేమో అన్నట్లు అప్పుడు భావించినా.. రానురాను మెరుగై నాణ్యమైన పేసర్‌గా మారాడు. అందుకు ఎంఆర్‌ఎఫ్‌ ఫౌండేషన్‌లోని గ్లెన్‌ మెక్‌గ్రాత్ సహకారం మరువలేనిదని ప్రఫుల్ గుర్తు చేసుకున్నాడు. గాయపడిన సమయంలోనూ కోలుకోవడానికి అక్కడి ఫిజియో మద్దతుగా నిలిచారని.. ఈ విషయంలో ఫౌండేషన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు.


Eenadu Telugu 15 hours ago
Home Flash News