ఇరాన్ యుద్ధంలో షాహిద్ డ్రోన్లను కూల్చాం: జెలెన్‌స్కీ
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాల్లో ఇరాన్ (Iran war) చేసిన ప్రతీకార దాడులను తమ దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) పేర్కొన్నారు. ఆ దేశాలపై ఇరాన్ ఉపయోగించిన షాహెద్ డ్రోన్లను తమ దళాలు కూల్చాయన్నారు. అటువంటి డ్రోన్లనే రష్యా తమపై వాడుతోందని వెల్లడించారు. వాటిని ఎదుర్కోవడానికి తమ సైన్యం ఉపయోగిస్తున్న దేశీయ ఇంటర్ సెప్టర్ డ్రోన్లను పశ్చిమాసియా దేశాలు కోరడంతో తమ దళాలను అక్కడికి పంపినట్లు తెలిపారు.
గల్ఫ్ దేశాల్లోకి దూసుకొస్తున్న శత్రు డ్రోన్లను కూల్చేయడమే కాకుండా.
ఆయా దేశాల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కూడా తమ బలగాలు సహాయపడ్డాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. దాదాపు 228 మంది ఉక్రెయిన్ నిపుణులను గల్ఫ్ దేశాల్లో మోహరించామన్నారు. ఇందుకు బదులుగా తమకు చమురు, డీజిల్, ఇతర ఆయుధాలు ఎగుమతి చేసేందుకు గల్ఫ్ దేశాలు అంగీకరించాయన్నారు. ఆయా దేశాలతో చేసుకున్న ఈ ఒప్పందాలు ఉక్రెయిన్ ఇంధన స్థిరత్వాన్ని బలోపేతం చేస్తాయన్నారు.
నాటో, ఐరోపా దేశాల నుంచి అమెరికా బలగాలు వెనక్కి?
షాహెద్-136 డ్రోన్ (Shahed drones)లను రష్యా..
ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుందని వాటిని ఎలా ప్రయోగించాలో ఇరాన్ రష్యాకు నేర్పించిందని జెలెన్‌స్కీ అన్నారు. అంతేకాకుండా వాటిని ఉత్పత్తి చేసే సాంకేతికతను కూడా ఆ దేశానికి ఇచ్చిందన్నారు. ఆ తర్వాత మాస్కో వాటిని తమ విడి భాగాలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. డ్రోన్లను ఎదుర్కోవడమే కాకుండా.. వాటి తయారీలోనూ తమ దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అత్యాధునిక డ్రోన్ ఇంటర్‌సెప్టర్‌లను ఉత్పత్తి చేసే ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో ఉక్రెయిన్ కూడా చేరిందన్నారు.