Select Location
All Locations
State
Region
City / District
తెలంగాణ డీజీపీ ఎదుట నేడు లొంగిపోనున్న 30 మంది మావోయిస్టులు

తెలంగాణ డీజీపీ ఎదుట నేడు లొంగిపోనున్న 30 మంది మావోయిస్టులు

హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ ఎదుట 30 మందికిపైగా మావోయిస్టులు నేడు లొంగిపోనున్నారు. మద్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించిన వివరాలను డీజీపీ శివధర్‌ రెడ్డి వెల్లడించనున్నారు. లొంగిపోనున్న వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్‌ సభ్యులు ఉన్నారు. వీరిలో బెటాలియన్‌ డిప్యూటీ కమాండర్ సోధి కేశాలు లొంగుబాటును పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. సుమారు 40 ఆయుధాలను పోలీసులకు వీరు సరెండర్ చేసినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్‌ కూంబింగ్ తీవ్రతరం కావడంతో కొద్దిరోజుల క్రితం తెలంగాణ పోలీసులను వీరు ఆశ్రయించినట్లు తెలుస్తోంది.


Eenadu Telugu 1 month ago
Home Flash News