Select Location
All Locations
State
Region
City / District
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) లో..

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) లో.. మెడికల్ ప్రొఫెషనల్స్ ఖాళీలు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్​టీపీసీ) మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 9న ప్రారంభమై, ఏప్రిల్ 23న ముగుస్తుంది. విభాగాల వారీగా ఖాళీలు: జీడీఎంఓ 210, ఫిజీషియన్ (జనరల్ మెడిసిన్) 25, పీడియాట్రిక్స్ 01, ఆప్తమాలజీ 01, ఓ & జీ 08. ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్​బీ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఏడాది నుంచి రెండేండ్ల అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 37 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


V6 News 1 month ago
Home Flash News