కాల్పుల విరమణపై కశ్మీర్‌లో సంబురాలు
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై కశ్మీరీలు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ విజయంగా వారు అభివర్ణించారు. శ్రీనగర్ .అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై కశ్మీరీలు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ విజయంగా వారు అభివర్ణించారు. వందలాది మంది ముఖ్యంగా షియా వర్గ ప్రాబల్యం కలిగిన కశ్మీర్ లోయలో ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఇరాన్ జెండాలు ఊపుతూ, టపాసులు పేల్చి సంబురాలు చేసుకొన్నారు. ‘ఈ కాల్పుల విరమణ ఇరాన్ సాధించిన విజయం. వాళ్లు అమెరికా, ఇజ్రాయెల్‌ను మోకాళ్ల మీద నిలబెట్టారు’ అని బుద్గాంలోని ఓ షియా ముస్లిం అన్నారు.