మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సనాతన సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రూ. 20 లక్షల ముడా నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులతో పాటు, సల్లోనిపల్లి - పలుగు తాండ మధ్య రూ. 166 లక్షల ఎస్టీఎస్‌డీఎఫ్ నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు.