... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
IPL 2026: ఇంపాక్ట్‌గా వ‌చ్చి ఇర‌గ‌దీసిన రిజ్వీ..

IPL 2026: ఇంపాక్ట్‌గా వ‌చ్చి ఇర‌గ‌దీసిన రిజ్వీ.. ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతున్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వీ (90 పరుగులు) మరోసారి అసలైన పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూయించాడు. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (51) హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ (35), నమన్ ధీర్ (28) అద్భుతమైన బ్యాటింగ్ తో కీలక పాత్ర పోషించారు.
అనంతరం 163 పరుగుల లక్ష ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి ఘోరంగా విఫలం కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన నితీష్ రాణా (0) రనౌట్ అయ్యాడు. దీంతో కేవలం 7 పరుగులకే ఢిల్లీ కీలకమైన రెండు వికెట్లను నష్టపోయింది. ఓపెనర్ పతుమ్ నిస్సంకతో కలిసి ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం మిచెల్ శాంట్నర్ బౌలింగ్ లో నిస్సంక (30 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్సుతో 44 పరుగులు) కొట్టిన బంతి నేరుగా మయాంక్ మార్కండే చేతిలో పడటంతో పెవిలియన్ కి వెళ్లిపోయాడు.
ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రిజ్వీ మరోసారి తన ఇంపాక్ట్ చూపించాడు. తనదైన ట్రేడ్ మార్క్ షాట్స్ తో కష్టాల్లో ఉన్న జట్టుని సమీర్ ( 51 బంతుల్లో 7 ఫోర్లు 7 సిక్సులతో 90 పరుగులు) అర్థ శతకంతో మ్యాచుని విజయ తీరాలకు చేర్చగా.. చివర్లో డేవిడ్ మిల్లర్ (21*), ట్రిస్టన్ స్టబ్స్(3*) మరో 18.1 ఓవర్లలోనే మ్యాచ్ ని కంప్లీట్ చేసేశారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక, ముంబై ఇండియన్స్ బౌలర్లలో మిచెల్ శాంటర్న్, దీపక్ చాహర్, కార్బిన్ బాష్ తలో వికెట్ పడగొట్టారు.

Source : V6 News

4 hours ago

Home Flash News