Select Location
All Locations
State
Region
City / District
Vaibhav Sooryavanshi: సంచ‌ల‌నాల సూర్య‌వంశీ!

Vaibhav Sooryavanshi: సంచ‌ల‌నాల సూర్య‌వంశీ!

అత‌డు కూడా అంద‌రిలా సాధార‌ణంగా క్రికెట్ ఆడుకుంటూ పోతే పెద్ద‌గా గుర్తింపు వ‌చ్చేది కాదేమో. కానీ 12 ఏళ్ల‌కే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి ఆడ‌కముందే రికార్డు సృష్టించాడు. ఇక బ్యాట్ ప‌ట్టి క‌ద‌నరంగంలోకి దూకిన త‌ర్వాత బ్యాట్‌కు అలుపొచ్చిందేమో కానీ అత‌డి పరుగుల దాహం కొనసాగుతూనే వస్తోంది.

14 ఏళ్ల‌కే ఐపీఎల్‌లో అడుగుపెట్టి సంచ‌ల‌నం సృష్టించిన ఆ బుడ‌త‌డు ఇటీవ‌లే ముగిసిన అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టాడు. ఆ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో 55 బంతుల్లోనే 175 ప‌రుగులు సాధించి ఔరా అనిపించాడు. కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సులోనే ప‌వ‌ర్‌హిట్టింగ్‌తో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారాడు బీహార్ చిన్నోడు వైభ‌వ్ సూర్య‌వంశీ.

ఇవాళ వైభవ్‌ సూర్యవంశీ 15వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నాడు. స‌చిన్ లాగే 15 ఏళ్ల వ‌య‌సులో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న వైభ‌వ్ సూర్య‌వంశీ కోరిక నెర‌వేరాల‌ని ఆశిద్దాం. హ్యాపీ బ‌ర్త్‌డే టూ వైభ‌వ్ సూర్య‌వంశీ..

క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ మార్చి 27తో మ‌రో మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు వైభవ్ తన 15వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. గతేడాది 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బీహార్ కుర్రాడు, ఇప్పుడు 15వ ఏట అడుగుపెడుతూ మరింత జోరు చూపించడానికి సిద్ధమయ్యాడు.

15వ పుట్టినరోజు సందర్భంగా వైభవ్ సూర్య‌వంశీ తన లక్ష్యాలను పంచుకున్నాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించడమే తన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న‌ 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలనేది త‌న చిర‌కాల కోరిక అని వైభ‌వ్ పేర్కొన్నాడు.


Sakshi 1 month ago
Home Flash News