... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
నిలిచిన బాస్మతీ రైస్ ఎక్స్‌పోర్ట్స్.. ఓడరేవుల్లోనే 10 లక్షల టన్నుల బియ్యం

నిలిచిన బాస్మతీ రైస్ ఎక్స్‌పోర్ట్స్.. ఓడరేవుల్లోనే 10 లక్షల టన్నుల బియ్యం

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధపు సెగలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీయ వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా బాస్మతీ బియ్యం ఎగుమతి పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఏటా సుమారు 6 బిలియన్ డాలర్లు అంటే రూ.54వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశానికి తెచ్చి పెట్టే ఈ రంగం.. ప్రస్తుతం రవాణా మార్గాల నిలిపివేత, పేమెంట్ సమస్యలు.. షిప్‌మెంట్‌ల జాప్యంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.

భారత్ ఏటా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతీ బియ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది. ఇందులో దాదాపు సగానికి పైగా వాటా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలదే. సాధారణంగా రంజాన్, ఈద్ పండుగల సమయంలో ఈ దేశాలకు ఎగుమతులు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల మధ్యప్రదేశ్ వంటి ప్రధాన బాస్మతీ హబ్‌లలోని రైస్ మిల్లులు వెలవెలబోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఎగుమతి సీజన్‌లో ఇప్పుడు నిశ్శబ్దం ఆవరించిందని వారు చెబుతున్నారు.

యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో ముప్పు పెరగడంతో లాజిస్టిక్స్ రంగం కుదేలైంది. గతంలో ఒక కంటైనర్‌కు 2వేల 500 డాలర్లుగా ఉన్న రవాణా ఖర్చు ఇప్పుడు ఏకంగా 7వేల నుండి 9వేల డాలర్లకు చేరింది. దీనికి తోడు ఇన్సూరెన్స్ ప్రీమియాలు పెరగడం, కంటైనర్ల కొరత ఏర్పడటంతో ఎగుమతిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల టన్నుల బాస్మతీ బియ్యం ఓడరేవుల్లో, గోడౌన్లలో మూలుగుతోంది. ప్రీమియం రకమైన '1121' బాస్మతీకి పశ్చిమాసియాలో ఉన్న డిమాండ్ యూరప్ లేదా ఆఫ్రికా దేశాల్లో ఉండదు. కాబట్టి ఈ నిల్వలను ఇతర మార్కెట్లకు మళ్లించడం కూడా సాధ్యం కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

 ఈ అంతరాయం వల్ల ఎగుమతిదారుల వర్కింగ్ క్యాపిటల్ పూర్తిగా నిలిచిపోయింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం సుమారు 2వేల కోట్ల నుండి 25వేల కోట్ల రూపాయల వరకు చెల్లింపులు నిలిచిపోయాయి. ఇది కేవలం వ్యాపారులకే కాకుండా పరోక్షంగా రైతులపై కూడా ప్రభావం చూపుతోంది. మిల్లులు కొనుగోళ్లు నిలిపివేయడంతో ధాన్యం ధరలు తగ్గే అవకాశం పెరిగింది. ఇది రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తుంది. రాబోయే సాగు సీజన్‌పై కూడా ఈ ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. భారత ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప భారత బాస్మతీ ఎగుమతుల ఇంజిన్ మళ్లీ గాడిన పడటం కష్టంగా కనిపిస్తోంది.

Source : V6 News

1 hour ago

Home Flash News