... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
నల్ల సముద్రంలో రష్యా చమురును తీసుకువెళ్తున్న టర్కీ ట్యాంకర్‌పై దాడి.. ఇంజిన్ రూమ్‌లో పేలుడు

నల్ల సముద్రంలో రష్యా చమురును తీసుకువెళ్తున్న టర్కీ ట్యాంకర్‌పై దాడి.. ఇంజిన్ రూమ్‌లో పేలుడు

టర్కీ: నల్ల సముద్రంలో గురువారం తెల్లవారుజామున టర్కీకి చెందిన ఒక చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి చేసిందని టర్కీ రవాణా శాఖ మంత్రి అబ్దుల్కాదిర్ ఉరలోగ్లు చెప్పారు. అయితే ఆ డ్రోన్ దాడి గాలిలో నుంచి కాకుండా.. సముద్ర ఉపరితలం నుంచి జరిగిందని తెలిపారు. బోస్ఫరస్ సమీపంలోని నల్ల సముద్రంలో ఈ ఘటన జరిగింది.

రష్యా చమురును తీసుకువెళ్తున్న టర్కీకి చెందిన ఆయిల్ ట్యాంకర్‌ను డ్రోన్ ఢీ కొట్టింది. రష్యా ముడి చమురును తీసుకువెళ్తున్న టర్కీకి చెందిన ఒక చమురు ట్యాంకర్, నల్ల సముద్రంలో గురువారం తెల్లవారుజామున పేలుడుకు గురైందని, డ్రోన్ అటాక్ కారణంగా పేలుడు సంభవించిందని అధికారులు అనుమానిస్తున్నారు.

సియెర్రా లియోన్ జెండా ఉన్న ఆ నౌక ఇంజిన్ గదిలో పేలుడు సంభవించినట్లు తెలిసిందని టర్కీ రవాణా మంత్రి అబ్దుల్కాదిర్ ఉరలోగ్లు తెలిపారు. నౌకను బ్లాక్ చేయడానికి ఇంజిన్ గదిని టార్గెట్ చేసి డ్రోన్ అటాక్ చేశారని టర్కీ అధికారులు తెలిపారు. ఈ దాడి ఏరియల్ డ్రోన్ ద్వారా కాకుండా నీటి మట్టం నుంచే జరిగిందని అధికారులు భావిస్తున్నారు. బోస్ఫరస్ జలసంధికి 30 కిలోమీటర్ల లోపే ఈ ఘటన జరిగిందని టర్కీ మీడియా చెప్పుకొచ్చింది.

Source : V6 News

1 hour ago

Home Flash News