... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తం: ఇరాన్

హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తం: ఇరాన్

టెహ్రాన్: అమెరికా తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం తమ శత్రువుల (ఇజ్రాయెల్, అమెరికా) కు, తమపై దాడులకు సాయం చేస్తున్న దేశాలకు మాత్రమే జలసంధిని మూసివేశామని, మిగతా దేశాల నౌకలు నిరాటంకంగా వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు గుర్తుచేసింది.

అయితే, డొనాల్డ్ ట్రంప్ తాజాగా హార్మూజ్ ను వెంటనే తెరవాలంటూ 48 గంటల గడువు విధించడం, ఆలోగా తెరవకుంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ సైనిక విభాగం ‘ఖాతమ్ అల్-అన్బియా’ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘‘అమెరికా గనుక మా విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే, హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తాం. ధ్వంసమైన మా ప్లాంట్లు పునర్నిర్మించే వరకు దానిని తిరిగి తెరవము’’ అని ప్రకటించింది.

Source : V6 News

1 hour ago

Home Flash News