... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
రన్‌వేపై వెళ్తుండగా.. ఫైర్‌ ట్రక్కును ఢీకొన్న విమానం

రన్‌వేపై వెళ్తుండగా.. ఫైర్‌ ట్రక్కును ఢీకొన్న విమానం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి ప్రమాదం జరిగింది. ఎయిర్‌ కెనడా ఎక్స్‌ప్రెస్‌ (Air Canada Express) విమానం రన్‌వేపై వెళ్తుండగా ఫైర్‌ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

న్యూయార్క్‌ (New York)లోని లాగార్డియా ఎయిర్‌పోర్టులో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడాలోని మాంట్రియల్‌ నుంచి వచ్చిన ఎయిర్‌ కెనడా ఎక్స్‌ప్రెస్‌ సీఆర్‌జే-900 విమానం.. లాగార్డియా విమానాశ్రయంలోని నాలుగో రన్‌వేపై దిగింది. అక్కడి నుంచి టాక్సీయింగ్‌ వైపు వెళ్తుండగా రన్‌వేపై ఉన్న అగ్నిమాపక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం పైకి లేచి పూర్తిగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం విమానాశ్రయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానంలో ఉన్న ప్రయాణికులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు. ప్రమాదం నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రమాదం సమయంలో విమానం గంటకు 24 మైళ్ల వేగంతో ప్రయాణించినట్లు ఫ్లైట్‌రాడార్ 24 డేటా వెల్లడించింది. ఘటనకు కొన్ని క్షణాల ముందు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు రన్‌వేపై ఉన్న వాహనాన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు తెలిసింది. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం వద్దకు వెళ్లేందుకు ఫైర్‌ట్రక్కు రన్‌వేను దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదే విమానాశ్రయంలో దిగిన యునైటెడ్‌ 737 మ్యాక్స్‌ విమానంలో ఎమర్జెన్సీ తలెత్తింది. క్యాబిన్‌లో ఘాటు వాసన రావడంతో విమాన సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఆ వాహనం వస్తుండగానే ఎయిర్‌ కెనడా విమానం ఢీకొట్టింది.

Source : Eenadu Telugu

1 hour ago

Home Flash News