... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
48 గంటల్లోగా హర్మూజ్‌ తెరవాలి.. లేదంటే..: ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం

48 గంటల్లోగా హర్మూజ్‌ తెరవాలి.. లేదంటే..: ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందేనని ఆదేశించారు. లేదంటే ఇరాన్‌ (Iran) విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు.

‘‘ఇప్పటి నుంచి సరిగ్గా 48 గంటల్లోగా ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని (Strait of Hormuz) తెరవాలి. ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదు. దాన్ని పూర్తిగా తెరవకుంటే.. ఇరాన్‌లోని పలు విద్యుత్‌ కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుంది. వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తాం. ముందుగా.. అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్‌ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుంది’’ అని ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికా- ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ను ఇరాన్‌ మూసివేసింది. దీంతో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌ తాజా హెచ్చరికలు చేశారు.

Source : V6 News

1 hour ago

Home Flash News