... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
నా నిర్ణయంలో మార్పు లేదు..: జీవన్‌రెడ్డి

నా నిర్ణయంలో మార్పు లేదు..: జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌: పార్టీ మారతానన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆయనతో మంత్రులు శ్రీధర్‌ బాబు, లక్ష్మణ్‌, ఎమ్మెల్యే సత్యం భేటీ అయ్యారు. గంటకుపైగా సమావేశమయ్యారు. పార్టీలో గౌరవం దక్కడం లేదని ఈ సందర్భంగా మంత్రుల ముందు జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భేటీ అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. జీవన్‌రెడ్డి 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారని అన్నారు. ఆయనతో అనేక అంశాలు చర్చించినట్లు తెలిపారు. ఆయన ఆవేదనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానని చెప్పారు.

Source : Eenadu Telugu

1 hour ago

Home Flash News