... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
పదేళ్ల తర్వాత అమెజాన్ సంచలన నిర్ణయం.. యాప్స్ అవసరం లేని కొత్త టెక్నాలజీ ఫోన్‌..

పదేళ్ల తర్వాత అమెజాన్ సంచలన నిర్ణయం.. యాప్స్ అవసరం లేని కొత్త టెక్నాలజీ ఫోన్‌..

అమెజాన్ మళ్లీ ఫోన్ల బిజినెస్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతునట్లు తెలుస్తోంది. పదేళ్ల క్రితం వచ్చిన ఫైర్ ఫోన్ ఫ్లాప్ అయిన తర్వాత, ఈసారి సరికొత్త టెక్నాలజీతో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది.

ఈ ఫోన్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తుంది. అంటే మనం ఫోన్‌తో మాట్లాడి పనులు చేయించుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు అమెజాన్ 'ట్రాన్స్‌ఫార్మర్' అనే కోడ్ నేమ్ పెట్టింది. స్టార్ ట్రెక్‌ సినిమా స్టైల్లో చూపించినట్లుగా వాయిస్ కంట్రోల్‌తో పనిచేసే కంప్యూటర్ లాంటి ఫోన్ తయారు చేయాలనేది జెఫ్ బెజోస్ కల.

సాధారణంగా మనం ప్రతి పనికి ఒక యాప్ వాడుతుంటాం. కానీ ఈ ఫోన్ డైరెక్ట్ మన మాటలతోనే పనులు చేసేస్తుంది అంటే యాప్స్ అవసరం ఉండదు. అమెజాన్‌లో షాపింగ్ చేయడానికి, డెలివరీ అప్‌డేట్స్ తెలుసుకోవడానికి ఇందులో చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇంట్లో వాడే స్మార్ట్ లైట్లు, ఏసీలు లాంటి వాటిని ఈ ఫోన్ ద్వారా సింపుల్ గా కంట్రోల్ చేయవచ్చు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఆపిల్, శాంసంగ్ కంపెనీలతో పాటు చైనా కంపెనీలైన షియోమి, వివో వంటి వాటితో అమెజాన్ పోటీ పడాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. ఖర్చులు లేదా ఇతర కారణాల వల్ల కూడా ఆగిపోయే ఛాన్స్ కూడా ఉందని సమాచారం.

Source : V6 News

1 hour ago

Home Flash News