... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Middle East conflict : ముదురుతున్న యుద్ధం.. ఇజ్రాయెల్‌ దాడిలో IRGC అధికార ప్రతినిధి అలీ మహ్మద్‌ మృతి

Middle East conflict : ముదురుతున్న యుద్ధం.. ఇజ్రాయెల్‌ దాడిలో IRGC అధికార ప్రతినిధి అలీ మహ్మద్‌ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం 21వ రోజుకు చేరింది. తాజాగా ఇరాన్‌లోని టెహ్రాన్ నగరంపై ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడగా ఈ దాడిలో IRGC ప్రతినిధి అలీ మహ్మద్ మృతిని చెందినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక ఇరాన్ కూడా ఆయన మృతిని ధృవీకరించింది. అలీ మహ్మద్‌తో సహా తమ నేతల మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రకటించింది.

ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ మధ్య భీకరయుద్దం 21వ రోజుకు చేరుకుంది. ఇరాన్‌ లోని కీలన నగరాలపై వైమానిక దాడులకు పాల్పడుతూ ఆదేశ సైన్యంలోని కీలక నేతలను ఒక్కరికిగా క్లియర్ చేస్తూ వస్తోంది ఇజ్రాయెల్‌. తాజాగా టెహ్రాన్‌పై మరోసారి మిసైళ్లతో దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇరాన్ IRGC అధికార ప్రతినిధి అలీ మహ్మద్‌ చనిపోయారని ఇజ్రాయెల్ ప్రకటిచింది. అటు ఇరాన్ కూడా అలీ మహ్మద్‌ మృతిని ధృవీకరించింది. అలీ మహ్మద్‌తో సహా తమ నేతల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రకటించింది. అలీ మహ్మద్‌ నైనీ మృతితో తమ బలగాల మనోధైరం సడలిపోదని ఇరాన్‌ తెలిపింది.

ఇక ఇరాన్ సైతం ఇజ్రాయెల్, అమెరికా సహా వాటి మిత్ర దేశాలపై దాడులను కొనసాగిస్తూనే ఉంది. యూఏఈ , ఖతార్‌ , అబూదాబి లోని అమెరికా బేస్‌లపై ఇరాన్‌ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఆయిల్‌, గ్యాస్‌ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్‌ దాడులు చేస్తోంది. దుబాయ్‌ను కూడా మరోసారి ఇరాన్‌ టార్గెట్‌ చేపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌ లోని ఐఫా పవర్‌ ప్లాంట్‌పై ఇరాన్‌ మిస్సైల్‌ దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ వెంటనే పవర్‌ ప్లాంట్‌ను మూసేసింది. ఇక దూబాయ్‌లోపి కువైట్‌లో అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ మీనా ఆల్‌ అహ్మదీపై ఇరాన్‌ డ్రోన్ల దాడి చేసింది.

ఇక పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 85 దేశాలపై పడింది. ఈ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు సరఫరా అవుతున్న చమురు ఆగిపోవడంతో సుమారు 85 పెట్రోలియం,గ్యాస్‌ కొరత ఏర్పడింది. దీంతో చాలా దేశాల్లో వీటి ధరలు పెరిగాయి. తాజాగా భారత దేశంలో సైతం పవర్ పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి.

ఇక ఈ యుద్ధం కారణంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌తో సహా అమెరికాకు కూడా భారీ నష్టం జరిగింది. ఇరాన్ దాడుల కారణంగా ఇప్పటివరకు అమెరికా సుమారు 16 యుద్ద విమానాలను అమెరికా కోల్పోయింది.

Source : TV9 Telugu

1 hour ago

Home Flash News