Select Location
All Locations
State
Region
City / District
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి డ్రోన్స్ కలకలం.. రూ.42 లక్షల డ్రోన్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి డ్రోన్స్ కలకలం.. రూ.42 లక్షల డ్రోన్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరో సారి డ్రోన్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. శనివారం (మార్చి 14) 70 డ్రోన్లు పట్టుబడిన ఘటన మరువక ముందే.. సోమవారం (మార్చి 16) మరో 74 డ్రోన్లను రహస్యంగా తీసుకొస్తూ ముగ్గురు ప్రరయాణికులు దొరికిపోయారు.

సింగపూర్ నుంచి అక్రమంగా డ్రోన్లు ఇండియాకు తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 42 లక్షల విలువైన 74 సింగపూర్ నుంచి ఇండియాకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

మహమ్మద్, తాజ్, అస్గర్ అనే ముగ్గురు ప్రయాణికులు సింగపూర్ నుండి తిరుగు ప్రయాణంలో 74 డ్రోన్లను ఇండియాకు తరలిస్తూ పట్టబడ్డారు. డ్రోన్లను సామగ్రిలో పెట్టుకుని వేర్వేరు విమానాల్లో శంషాబాద్ కి వచ్చినట్లు గుర్తించారు. సామగ్రిన తనిఖీల్లో 42 లక్షల రూపాయల విలువైన డ్రోన్లు పట్టుబడటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

సింగపూర్ నుంచి భారీగా డ్రోన్లను ఇండియాకు డంప్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో డ్రోన్లకు పెరుగుతున్న డిమాండ్ వలన అక్రమంగా తరలిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం (మార్చి 14) 70 డ్రోన్లు పట్టుబడిన సంగతి తెలిసిందే. 50 లక్షల రూపాయల విలువైన డ్రోన్లు పట్టుబడిన రెండు మూడు రోజుల గ్యాప్ లోనే మళ్లీ డ్రోన్స్ పట్టుబడటంపై పోలీసులు, కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.


V6 News 29 days ago
Home Flash News