Select Location
All Locations
State
Region
City / District
ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతానని ఊహించలేదు..: మోహన్‌ బాబు

ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతానని ఊహించలేదు..: మోహన్‌ బాబు

ఇంటర్నెట్‌ డెస్క్: ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 50 ఏళ్ల నట జీవితం ఉంటుందని తాను ఊహించలేదని మోహన్‌ బాబు (Mohan Babu) అన్నారు. మోహన్‌ బాబు యూనివర్సిటీ 34వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ కెరీర్‌ను గుర్తుచేసుకున్నారు.‘‘ఇన్నేళ్ల పాటు కెరీర్‌లో కొనసాగుతానని ఎప్పుడూ అనుకోలేదు. 1975 నవంబర్ 22 నా మొదటి సినిమా ‘స్వర్గం నరకం’ విడుదలైంది. నేను ఒక ఏడాది పాటు సినిమాలు చేస్తానేమో.. తర్వాత అవకాశాలు రావు మళ్లీ నా గ్రామానికి వెళ్లిపోవాలేమో అనుకునేవాడిని.

ఈ 50 ఏళ్లలో 560 సినిమాలు చేశాను. ఇంకా చేస్తూనే ఉన్నాను. ఒక సినిమాను మించి మరొకటి ఉన్నాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేక్షకుల అభిమానం వల్లే ఈ స్థితిలో ఉన్నాను’’ అని అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఏం చేయాలి.. ఎలా బ్రతకాలి.. భవిష్యత్తును ఎలా నిర్ణయించుకోవాలి అన్నది మీకు తెలుసు. నేను మీ వయసులో ఉన్నప్పుడు ఈ కంప్యూటర్లు, ఫోన్లు లేవు. కానీ, ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు ఫోన్‌లు ఉండడం చూసి నేను ఆశ్చర్యపోతున్నా. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ల ఆశలు నెరవేర్చండి’’ అని మోహన్ బాబు చెప్పారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల హాజరయ్యారు. ఆయన మోహన్‌ బాబుపై ప్రశంసలు కురిపించారు. ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) సెట్‌లో ఆయన (Mohan Babu) ఉంటే ఆ రోజు షెడ్యూల్‌ అంతా అనుకున్న టైమ్‌కు పూర్తవుతుంది. మిగిలిన రోజుల్లో ఆలస్యమవుతుంది. ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. అది ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ట్రైలర్‌ విడుదలైనప్పుడు మీకే అర్థమవుతుంది’’ అని చెప్పారు.


Eenadu Telugu 29 days ago
Home Flash News