T20 world cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాబ్వే ఘన విజయం
టీ20 వరల్డ్ కప్ 2026లో సంచలనం నమోదైంది. పటిష్ట ఆస్ట్రేలియా జట్టుపై జింబాబ్వే విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచులో 23 పరుగుల తేడాతో ఆసీస్‌ను జింబాబ్వే జట్టు కంగుతినిపించింది. టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే ఓడించడం ఇది రెండోసారి. గతంలో తొలి టీ 20 వరల్డ్ కప్ 2007లోనూ ఆసీస్ జట్టును జింబాబ్వే ఓడించింది. 2024 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు మరో దారుణ ఓటమి చవిచూసింది.
అఫ్గానిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది.
కొలంబో లోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన లీగ్ స్టేజీ మ్యాచులో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఏ దశలోనూ రాణించలేకపోయింది. 13 పరుగులకు ఓపెనర్ జోష్ ఇంగ్లిష్ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వరుస విరామాల్లో బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. మ్యాట్ రెన్షా (65) హాఫ్ సెంచరీ చేయడంతో ఆసీస్ జట్టు 19.3 ఓవర్లకు 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది.