సాధువులపై భూమన అనుచిత వ్యాఖ్యలు చేశారు: శ్రీనివాసానంద సరస్వతి
విశాఖపట్నం: సాధువులపై వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. వైకాపా అజెండాను భూమన బయటపెట్టారని విమర్శించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘సాధువులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మాకు కుటుంబం లేదు. సమాజమే మా కుటుంబం.
మాకు రూ.కోట్లు ఎందుకు? దేవుడు ఇచ్చిన సంపద ఉంది. ప్రాణాలు పోయినా వేంకటేశ్వరస్వామి కోసం పోరాడతాం. తప్పు జరిగిందని తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరిస్తున్నందున ఆయన క్షమాపణ చెప్పాలి. హిందూ సంఘాల ప్రతినిధులు మౌనంగా ఉండటంతోనే వైకాపా నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు’’అని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.