Pawan Kalyan: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్
నరసరావుపేట: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి పవన్ వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో కొత్తపాలెం-కోటప్పకొండ రోడ్డును ఆయన ప్రారంభించనున్నారు.