South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్

డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రిమియర్ లీగ్ ఐదో ఎడిషన్‌ (WPL 2027) జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, మాజీ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. జనవరి 14 నుంచి 24 వరకు వడోదరలో 11 మ్యాచ్‌లు జరగనున్నాయి. అదే నెల 26 నుంచి మిగిలిన 11 మ్యాచ్‌లు ముంబయిలోని బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతాయని షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో బీసీసీఐ పేర్కొంది. అయితే, ఇప్పుడు బ్రబోర్న్‌ స్టేడియంలో జరగాల్సిన అన్ని మ్యాచ్‌లను వాంఖడే స్టేడియానికి షిప్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఫిబ్రవరి 14 నుంచి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లకు వడదోర, బ్రబోర్న్‌ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లకు మధ్య తక్కువ సమయమే ఉండటంతో పిచ్‌లను సిద్ధం చేయడం కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్రబోర్న్‌ స్టేడియంలో నిర్వహించాల్సిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లను వేరే చోటకు మార్చాలని బీసీసీఐకి ఐసీసీ విజ్ఞప్తి చేసింది. దీంతో వాంఖడేలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఇదే స్టేడియంలో ఫిబ్రవరి 5న ఎలిమినేటర్ మ్యాచ్‌, ఫిబ్రవరి 7న ఫైనల్ మ్యాచ్‌ జరుగుతాయి.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 6 days ago

Related News

భారత వైమానిక రంగానికి అమెరికా కఠిన పరీక్ష!
భారత వైమానిక రంగానికి అమెరికా కఠిన పరీక్ష!
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
ఏపీకి తుపాను ముందస్తు హెచ్చరిక జారీ
ఏపీకి తుపాను ముందస్తు హెచ్చరిక జారీ
⬅ Back
➕ Post Ad
To Ads ➡