South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే

మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే

అమరావతి: రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు(Andhra Pradesh Municipal Elections) కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. ఈనెల 26న జరగనున్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌.. కసరత్తు పూర్తి చేసి మేయర్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో జనసేనకు రెండు నగరపాలక సంస్థలు, మూడు మున్సిపాలిటీలు, భాజపాకు ఒక కార్పొరేషన్‌, రెండు మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలు కేటాయించారు. మిగిలిన వాటిలో తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

తెదేపా అభ్యర్థులు..
మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్‌కు తెదేపా మేయర్‌ అభ్యర్థిగా పేరం ఏడుకొండలు బరిలోకి దిగనున్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థులుగా.. తణుకు నుంచి బసవ రామకృష్ణ, పాలకొల్లు నుంచి ఆబోతుల ఉషారాణి, నరసరావుపేట నుంచి ఎన్‌.రూపేశ్‌ గుప్తా, గుడివాడ నుంచి మారీదు కరుణ, శ్రీకాళహస్తి నుంచి పేట బాలాజీ పోటీ చేయనున్నారు. తాడిగడప నుంచి పీతా గోపీచంద్‌, పొన్నూరు నుంచి కండ్రు విజయలక్ష్మి, కందుకూరు నుంచి పిడికిటి వెంకటేశ్వర్లు, ఆమదాలవలస నుంచి కూన ప్రమీల, గూడూరు నుంచి చౌటూరి శిరీషను అధిష్ఠానం ఖరారు చేసింది. చింతలపూడి నగర పంచాయతీకి కె.ఎస్తేర్‌ రాణి, పొదిలికి వరికుంట్ల అనిల్‌కుమార్‌, అల్లూరుకు తోటకూర సునీల్‌కుమార్‌, బి.కొత్తపేటకు కుడుము శ్రీనివాసులు ఛైర్మన్‌ అభ్యర్థులుగా నిలవనున్నారు.

జనసేన అభ్యర్థులు వీరే..
మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఖరారు చేశారు. శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా.దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ నుంచి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. రాజాం నుంచి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి పాలూరు వెంకటేశ్వర రావు.. మున్సిపల్‌ చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తారని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

భాజపా అభ్యర్థులు..
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. రాజమహేంద్రవారం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా రేలంగి శ్రీదేవిని ప్రకటించారు. మున్సిపాలిటీలకు సంబంధించి కావలి నుంచి గుండ్లపల్లి భరత్ కుమార్, బాపట్ల నుంచి ఇస్కా సునీల్ కుమార్ పేర్లను ఖరారు చేశారు.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 6 days ago

Related News

డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
భారత వైమానిక రంగానికి అమెరికా కఠిన పరీక్ష!
భారత వైమానిక రంగానికి అమెరికా కఠిన పరీక్ష!
ఏపీకి తుపాను ముందస్తు హెచ్చరిక జారీ
ఏపీకి తుపాను ముందస్తు హెచ్చరిక జారీ
⬅ Back
➕ Post Ad
To Ads ➡