Glacial Lakes: సిక్కింలో సుమారు 40 మంచు సరస్సు(Glacial Lakes)లు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తెలిసింది. వీటిల్లో 16 మంచు సరస్సులు అత్యధిక రిస్క్‌లో ఉన్నట్లు ఓ డేటా ద్వారా వెల్లడైంది. ఆ సరస్సులు ఏ క్షణమైనా ఉప్పొంగే అవకాశాలు ఉన్నాయని, దీంతో దిగువ ప్రాంతాలకు సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గ్యాంగ్‌టక్: తూర్పు హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో సుమారు 40 మంచు సరస్సు(Glacial Lakes)లు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తెలిసింది. వీటిల్లో 16 మంచు సరస్సులు అత్యధిక రిస్క్‌లో ఉన్నట్లు ఓ డేటా ద్వారా తెలిసింది. ఆ సరస్సులు ఏ క్షణమైనా పేలే అవకాశాలు ఉన్నాయని, దీంతో దిగువ ప్రాంతాలకు సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 26వ తేదీన నేపాల్‌లో మంచు కొండ విరిగిపడడంతో.. భారీ జలవిలయం సంభవించిన విషయం తెలిసిందే. నేపాల్ వరదల్లో 1250 మందికిపైగా మృతిచెందగా, మరో 4 వేలకు పైగా మిస్సయ్యారు.
హిమాలయ ప్రాంతాల్లో కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయని, ప్రస్తుతం ఉన్న వాటి వైశ్యాలం పెరుగుతోందని ఓ రిపోర్టు ద్వారా తెలిసింది. మంచు కొండలు కరిగిపోవడం వల్ల గ్లేసియల్ సరస్సులు ఏర్పడుతాయని, ఆ సరస్సులో ఉన్న నీరంతా సమీపంలో గుమ్మికూడుతుందని, అయితే ఇలాంటి సరస్సులు ఒక్కసారి పేలినప్పుడు.. భూకంపం లాంటి పరిస్థితి ఏర్పడుతుందని, దీని వల్ల ఆకస్మిక వరదలు సంభవించే అకాశాలు ఉన్నాయని రిపోర్టులోచెప్పారు.
2023 అక్టోబర్‌లో సిక్కింలో సంభవించిన గ్లేసియల్ బస్ట్ వల్ల.. సుమారు 60 మంది మృతిచెందారు. మంగన్, గ్యాంగ్‌టక్, పాక్యాంగ్, నామ్‌చి జిల్లాల్లో విస్తృత స్థాయిలో నష్టం జరిగింది. గ్లేసియల్ లేక్స్‌లో జరుగుతున్న మార్పులను రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా పరిశీలిస్తున్నట్లు ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ తంబే తెలిపారు. 40 ప్రమాదకర సరస్సుల్లో 16 సరస్సులు కేటగిరీ ఏ(హై రిస్క్) లో ఉన్నాయి. కేటగిరీ బీలో 2, కేటగిరీ సీలో 9, మిగితా 13 సరస్సులో మరో కేటగిరీలో ఉన్నాయి.
Smacy News
48 minutes ago